Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsతెలంగాణ ఉద్యమ కవి, రచయిత అందెశ్రీ కి కన్నీటి జోహార్లు – అరుణోదయ సాంస్కృతిక...

తెలంగాణ ఉద్యమ కవి, రచయిత అందెశ్రీ కి కన్నీటి జోహార్లు – అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు కోలా స్వప్న

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, న‌వంబ‌ర్ 11, అద్దం న్యూస్ :      తెలంగాణ ప్రజా కవి, ప్రముఖ రచయిత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారధి అందెశ్రీ గత కొంతకాలంగా అస్వస్థతకు గురై సోమ‌వారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలి మరణించిన సంగ‌తి విదిత‌మే. ఈ సంద‌ర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు కోలా స్వప్న త‌న సంతాపాన్ని తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన పాటను, ఆటను తెలంగాణ వ్యాప్తంగా ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని ఉర్రూ తొలగించిన ప్రజా ఉద్యమ కళాకారుడు, సామాజిక ఉద్యమకారుడు అందెశ్రీ అని కొనియాడారు. అనేక గొప్ప గొప్ప కళా గానాలతో జాతిని జాగృతం చేసిన అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటుగా భావిస్తున్నామ‌న్నారు. సమాజంలో అసమానతలు, పాలకవర్గాల దోపిడీ విధానాలు కళలు, కళాకారులు దోపిడీ పాలకుల తొత్తులుగా మారుతున్న క్రమంలో కళలు ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం, సామాజిక మార్పు కోసం ప్రతిబింబించాలని కోరుకున్నాడ‌న్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోయే అంతటి గొప్ప రచనలు అందించిన రచయిత అందెశ్రీ అని అన్నారు. మనుషులలో మానవత్వం మంట కలిసి పోయే విధానాలు రచన రూపంలో చాటిచెప్పిన మహా రచయిత, కవి, కళాకారుడు, గాయకుడు అందెశ్రీ మరణం సాహితీ లోకానికి, సమాజానికి తీరని లోటు. అందెశ్రీ కి జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నామ‌న్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page