Friday, September 18, 2026
HomeGREATER HYDERABADతెలంగాణ ఉద్యమకారుల చట్ట బద్దమైన కమిటీ వేయాలి

తెలంగాణ ఉద్యమకారుల చట్ట బద్దమైన కమిటీ వేయాలి

తెలంగాణా ఉద్యమకారుల చట్ట బద్దమైన కమిటీ వేయాలి
» తెలంగాణ ఉద్యమ సంఘాల డిమాండ్

బషీర్‌బాగ్‌, మార్చి 12, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్యమకారుల చట్ట బద్దమైన కమిటీ వేయాలని, 6 నెలల కాల పరిమితి ఉండాలని తెలంగాణా ఉద్యమ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం హైద‌రాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో తెలంగాణా ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వ‌ర్యంలో విలేక‌రుల స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్బంగా తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియు జేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, టియుఎఫ్ నాయ‌కుడు జానకి రెడ్డి, ఓరుగంటి ఆనంద్, సుల్తాన్ యాదగిరి, సికింద్ర బేగం, అనిల్ కుమార్, సుజి, కొమురయ్య తదితరులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఉద్యమకారుల అంశంలో వెంటనే చట్ట బద్ద మైన కమిటీ వేయాలన్నారు. ఈ కమిటీకి 6 నెలల కాల పరిమితి మాత్రమే ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల త్యాగం మరువలేనిదని, ఎన్నో కష్టాలు, కేసులు, జైలు జీవితం అనుభవించన వారు నేడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుండాలని కోరారు.

తెలంగాణ అమర వీరుల కుటుంబాల‌ను కూడా ఆదుకోవడానికి ముందుకు రావాలని ప్రభుత్వన్ని వారు డిమాండ్ చేశారు. అలాగే ఉద్య‌మ‌కారుల‌కు సంక్షేమ బోర్డు వేయాలని, 250 గజాల స్థ‌లం ఇవ్వాల‌ని, హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బైరాగి, లారా, గోశిక రవి, యాదగిరి, హరి, సుచరిత తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page