అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ పదవులకు లైన్ క్లియర్
హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ 6 నెలలు పూర్తి కానుంది. ఈ రోజు ఫైల్‌పై గవర్నర్ శివ్ ప్రతాప్ సంతకం చేశారు. తెలంగాణ కేబినెట్లో మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. పదవిలో కొనసాగాలంటే ఈ నెల 30వ తేదీలోపు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వడం తప్పనిసరి అయింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వారు ఆరు నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాల్సి ఉంది.. ఒకవేళ ఈ నెల 30 లోపు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ శివ్ ప్రతాప్‌ను కలిసి సుధీర్ఘంగా చర్చించారు. ఇంత కాలం గవర్నర్ కోటాలో పెండింగ్‌లో ఉన్న అజారుద్దీన్, కోదండరాం పేర్లను పరిశీలించాలని.. గ్రీన్ సిగ్నన్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే వారి అభ్యర్థిత్వాలకు గవర్నర్ నేడు ఆమోదించారు.![]()












Leave a Reply