సోనియాగాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్దించింది
– మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్
హైదరాబాద్, డిసెంబర్ 9, అద్దం న్యూస్ : సోనియాగాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాశం అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే సోనియాగాంధీ చలించిపోయి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు ప్రకటించిన రోజు డిసెంబర్ 9 అని అన్నారు. ఆమె తన బర్త్ డే సందర్భంగా బహుమతిగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు అని, ఈ రోజు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. పార్లమెంట్‌లో తనతో పాటు కాంగ్రెస్ ఎంపీలందరం తెలంగాణ కోసం ఆందోళనలు చేసి, సీమాంధ్ర ఎంపీల వాదనలను, గొడవలను అడ్డుకుని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కల్పనయాదవ్, వాజిద్ హుస్సేన్, విడి.క్రిష్ఱ, కాంగ్రెస్ పార్టీ పలు డివిజన్ల అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ యాదవ్, తిరుమల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అతినగరం సుధేష్, మనోహర్ సింగ్, లోకేష్ యాదవ్, చంద్రశేఖర్, నాగభూషణం, విజయ్ యాదవ్, మురళీ మోజస్, కవిత, నరేందర్, రమేష్ గౌడ్, రాజ్‌దీప్, సురేష్, రామానందరెడ్డి, మేడి సురేష్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply