హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరం చిక్కడపల్లిలో ప్రసిద్ధిచెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శేష వస్త్రాలు, సిసి కెమెరాల మెయింటనెన్స్, పూల అలంకరణ వాటికి టెండర్ ప్రక్రియ శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. దేవాదాయ శాఖ ఆలయ ఈవో అన్నపూర్ణ, ఇన్‌స్పెక్టర్ సురేఖల పర్యవేక్షణలో ఈ టెండర్ ప్రక్రియ జరిగింది. ఈ టెండర్‌లో నలుగురు పాల్గొన్నారు. పూల అలంకరణ, శేష వస్త్రాలు, సిసి కెమెరాల మెయింటనెన్స్ వాటి టెండర్లను వారు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ… ఈ టెండర్ ప్రక్రియ సంవత్సరం ఉంటుందన్నారు. టెండర్లు దక్కించుకున్న వారు ఆలయంలో జరిగే ప్రతి రోజు జరిగే పూజలతో పాటు విశేష పూజలు, పండుగల సమయంలో పూల అలంకరణ చేయడం, సిసి కెమెరాల పర్యవేక్షించడం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీనాథ్‌గౌడ్, ఆలయ సూపరింటెండెంట్ రమేష్, సీనియర్ అసిస్టెంట్ సుబ్రమణ్యం తదితరులున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply