...

భారతీయ విద్యాభవన్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

అలరించిన  ‘ చిన్నికృష్ణులు ’
భారతీయ విద్యాభవన్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కాచిగూడ, సెప్టెంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :   భారతీయ సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు పండుగలు నిలువుటద్దాలుగా నిలుస్తాయని గోల్నాకలోని భారతీయ విద్యాభవన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం బృందావనాన్ని తలపించింది. విద్యార్థులు చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో సందడి చేశారు. చిన్నారులు తమ చిలిపి చేష్టలతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.