ఉగ్రవాదులను ఉక్కు పాదంతో అణిచివేయాలి
అంబర్పేట్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ : హిందూ పర్యాటకులను టార్గెట్ చేసి బలి తీసుకున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టొద్దని వారికి తగిన గుణపాఠం చెప్పాలని అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన హిందూ పర్యాటక అమరవీరుల ఆత్మశాంతి కలగాలని కోరుతూ విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పటేల్‌నగర్ చౌరస్తాలో శాంతి ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు అన్నదమ్ము వలే నివసిస్తున్న భారతదేశంలో అలజడి సృష్టించాలని భావిస్తున్న ఉగ్రవాదులను కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలని కోరారు. ఉగ్రవాదులను ఉక్కు పాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు ముస్లీం మత పెద్దలు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, లవంగు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి జాఫర్, రంగు సతీష్ గౌడ్, ఐయాస్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply