Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఫిజిక్స్ వాలా తో చేసుకున్న ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా...

ఫిజిక్స్ వాలా తో చేసుకున్న ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి కె.అశోక్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :   ఫిజిక్స్ వాలా తో చేసుకున్న ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇప్పించాలని ఎస్ఎఫ్ఐ హైద‌రాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి కె.అశోక్‌రెడ్డి శ‌నివారం పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికలు విద్యాసంస్థలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా జెఈఈ, నీట్, క్లాట్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించటం హర్షించదగ్గ విషయమ‌న్నారు. కానీ ఈ కోచింగ్‌ను కార్పొరేట్ ఎడ్యు టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా తో తెలంగాణ అచివర్స్ 2025 కోసం చేసిన ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వమే ఉచిత కోచింగ్ ను అందించే చర్యలు తీసుకోవాలని ప్ర‌భుత్వాన్ని కోరారు. వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న ఫిజిక్స్ వాలా వంటి సంస్థలతో కాకుండా ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన కోచింగ్ ఇప్పించాలని కోరారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page