బీసీలపై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది కపట ప్రేమ
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ : బీసీలపై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కపట ప్రేమను చూపిస్తున్నాయని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏనాడో బీసీల ఊసెత్తని బిఆర్ఎస్ పార్టీ ఈరోజు బీసీల మీద ఎనలేని ప్రేమ ఒలకబోస్తూ బీసీ రిజర్వేషన్లు పేరుతో పదేపదే అదే విషయం మాట్లాడుతూ “పాడిందే పాడరా పాసి పళ్ల దాసరి” అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీసీల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా, మరోవైపు అధికార పక్షం తమ పట్టు నిలబెట్టు కోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు కామారెడ్డిలో ఏధీమాతో 42 శాతం రిజర్వేషన్లంటూ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ అని హామీ ఇచ్చారు. కేవలం ప్రజలను వంచించడానికి చెప్పిన మాటలేనని అర్థమవుతుందన్నారు. మేము అసెంబ్లీలో తీర్మానం చేసామంటూ ఆర్డినెన్స్ గవర్నరుకు పంపామంటూ చెప్పుకోవడం ద్వారా ఎటువంటి ప్రయోజనంలేదన్నారు. ఆర్డినెన్స్ వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఏదో చేశామని చేతులు దులుపు కోవడం మాత్రమేనని అన్నారు. అధికార పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ ప్రచారం చేసుకోవడం తప్పితే చీటికి మాటికి ఢిల్లీ పోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. దేశానికే వెన్నుముక లాంటి బీసీలను బీసీలను గుర్తించింది, బలహీన వర్గాల ప్రజలకు సమాజంలో సమున్నతమైన స్థానం వారి అభివృద్ధికి కృషి చేసింది, రిజర్వేషన్లు కల్పించింది కేవలం తెలుగుదేశం పార్టీ నేనని అని సాయిబాబా అన్నారు. బిసిలను సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పూర్తి ప్రాధాన్యం కల్పించింది కేవలం టిడిపినేనని అన్నారు. ప్రభుత్వానికి తెలియజేసేది ఏమనగా బేషజాలు పక్కన పెట్టి నిజాలు ఒప్పుకొని బిసిలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బీసీలకు ఇంతకాలం ఏం చేశారో తెలియజేయాలని మాట్లాడితే వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకోవడం కాదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు మేము (కాంగ్రెస్, బిఆర్ఎస్) ఏదో చేశామని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే గాని దీనివల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఇవన్నీ కేవలం బీసీలను మభ్య పెట్టడానికి రెండు పార్టీలు చేస్తున్న కుట్రలేనని, నిజంగా బిసీల పట్ల ఇద్దరికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉన్నాయని, ఒక పార్టీ “హౌవులా”అని ఇంకో పార్టీ దానికి మించి “సన్నాసి” అని, మాటల యుద్ధంతో ప్రజలకు రాజకీయాలంటేనే ఏవగింపు, అసహనం వచ్చేలా తయారుచేశారని వాపోయారు. ప్రజాస్వామ్యంలో ఈ విధానం పనికిరాదని అన్నారు. ఎమ్మెల్సి కవిత పోటీపడి రోడ్డెక్కి బిసిలంటూ నటిస్తుంటే వీరికి తోడు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ బిసి పేరుతే పాదయాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బిసిలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకొని బిసిలకు ఎవరేమి చేసారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply