ఛ‌లో ఛ‌లో… కోకాపేట్‌ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

ఛ‌లో ఛ‌లో… కోకాపేట్‌
భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

కోకాపేట్‌, జూలై 12, ( అద్దం న్యూస్ ) :  ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కోకాపేట్‌లోని ఆరెకటిక ఆత్మగౌరవ భవనం స్థలం వద్ద జగన్మాత జగజ్జనని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం బోనాల పండుగ జాతర కార్యక్రమం కన్నుల పండుగగా ఎంతో వైభవంగా బంధుమిత్రుల సహకారంతో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కృష్ణ‌య్య మాట్లాడుతూ… అమ్మవారి గుడి నిర్మాణంతో పాటు భారీ భవనానికి నిధులు మంజూరు చేయిస్తానని బాధ్యత తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సత్యం మాట్లాడుతూ… ఆరెకటికల సమస్యల పరిష్కారానికి ప్రతి ఉద్యమానికి తన మద్దతును అందజేస్తానని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, బీసీ జేఏసీ కన్వీనర్ గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చిన ఒక ఎకరం భూమి ఇది మనదని ఇది అందరిదని కులం బిడ్డలకు ధైర్యం తెలుపడానికి, జెసిబి తో మందిరానికి తగినంత స్థలాన్ని చదును చేయించి కొండమీద శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి చిన్న గుడిని నిర్మించుకోవడం జరిగింద‌న్నారు.

అతి భారీ మందిరాన్ని నిర్మించుకోవడం మిగిలిందని… దాంతో పాటు మన భవనాన్ని అద్భుతంగా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు కేటాయింపజేసి నిర్మించుకుందామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రస్ట్ నాయకులు జి.నర్సింగరావు, శ్రీనివాస్, ఎన్.రవి, జితేందర్, యు.మురళి, జగదీష్, అత్తికారి మల్లేష్, ప్రశాంత్, ఎం.కొమురెల్లి మల్లన్న శ్యామ్, దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ సేనాపతి, మాజీ కౌన్సిలర్ రమేష్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నందీశ్వర్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్, పాలెం రమేష్, రమేష్, కోశాధికారి కేడి దినేష్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె.వనజ బాయ్, ఉపాధ్యక్షురాలు సరస్వతి బాయ్, సిటీ కన్వీనర్ మహేందర్, నల్గొండ టౌన్ అధ్యక్షుడు ప్రేమ్, వరంగల్ జిల్లా అధ్య‌క్షుడు క్రాంతి, కరీంనగర్ జిల్లా అధ్య‌క్షుడు ఆర్.శ్రీనివాస్, మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షుడు మహేందర్, జగిత్యాల జిల్లా అధ్య‌క్షుడు గుడికే అశోక్, సిద్దిపేట జిల్లా అధ్య‌క్షుడు మిరుదొడ్డి బాల్రాజ్, బాలకృష్ణ, గోషామహల్, గోపాల్, రాజేష్, నర్సింగ్ రావు, జియాగూడ దుర్గా సింగ్, నర్సింగరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page