హైదరాబాద్, అద్దం న్యూస్ : శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్దంకావాలని, దోపిడి పీడనలు ఉన్నంత కాలం ప్రజా పొరాటాలు కొనసాగుతున్నాయని పలువురు వక్తలు తెలిపారు. ప్రజాయుద్ద నౌక గద్దరన్న పై కాల్పులు జరిపిన రోజును గుర్తు చెసుకుంటూ అదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గద్దర్ పౌండెషన్ అధ్వర్యంలో పాట పై తూటా ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత పై సభ జరిగింది. ఈ సభలో ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రచయిత మినా కందా స్వామి మాట్లాడుతూ.. ప్రజా సంస్కృతిని పాలకులు నిశబ్దంగా మారిస్తే గద్దర్ నిశబ్దాన్ని బద్దలు కొట్టారని అన్నారు. ప్రశ్నించె కవులను, రచయితలను, సామాజిక కార్యకర్తలను అర్బన్ నక్సల్స్ గా కేంద్ర ప్రభుత్వం ముద్ర వేస్తుందన్నారు. బ్రహ్మణియ హిందుత్వ ఫాసిజం పెరిగిపోతుందన్నారు. 2026 వరకు నక్సలిజాన్ని నిర్మూలిస్తామని అమితషా ప్రకటించడం సిగ్గు చేటన్నారు. ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. తీవ్రమైన నిర్భందం కొనసాగుతున్న తరుణంలో గద్దర్ పై కాల్పులు జరపడం దురద్రుష్టకరం అన్నారు. ఈ దేశంలో బహుజన వర్గం, అణచివేత వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కొనియడారు.
ప్రజా గాయకురాలు అరుణొదయ విమలక్క మాట్లాడుతూ గద్దర్ కు మరణం లేదని స్పష్టం చేసారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ తెజావత్ బెల్లయ్య నాయక్, జన సేన పార్టి జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, గద్దర్ పౌండెషన్ వ్వవస్ధాపక కార్యదర్శి జివి.సూర్యకిరణ్, దళిత బహుజన ఫ్రంట్ ( డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్, విసికె పార్టి రాష్ట్ర అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్, సినియర్ జర్నలిస్టు ఆస శ్రీరాములు, సాంబమూర్తి, ఆర్,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు











Leave a Reply