ఇంధన ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి

ఇంధన ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి
– రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్‌

నాంప‌ల్లి, మే 20, ( అద్దం న్యూస్ ) :   ప్రజలపై భారంగా మారిన ఇంధన ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపును వ్య‌తిరేకిస్తూ, మోడీ వ్యాఖ్యలపై మోడీ కేంద్ర ప్రభుత్వంపై నిర‌స‌న‌ ధర్నాను బుధ‌వారం జ‌రిగింది. గాంధీభవన్ నుంచి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్ లు ఎడ్ల బండి పై తన నిరసన కార్యక్రమాన్ని చేప‌ట్టారు. గాంధీభవన్ నుంచి నాంపల్లి వరకు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో మోడీ డౌన్… డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… పెట్రోల్ చార్జీలు హైక్ అవడం.. సామాన్య కుటుంబాన్ని కారులు కొనొద్దని చెప్పి, విదేశీ యాత్రలకు పోవద్దని చెప్పి, పండగలకు కనీసం బంగారాన్ని సమకూర్చుకునే పేద వర్గాల ప్రజలను బంగారం కొనొద్దని చెప్పడం విడ్డూరంగా ఉంద‌న్నారు. మోడి మాత్రం అన్ని విదేశాలు తిరుగుకుంటూ ఈ విధంగా చేస్తున్నందుకు, వారికి నిరసనగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి, ఉజ్జ‌యిని మ‌హాంకాళి దేవాల‌యం ట్ర‌స్ట్ బోర్డు స‌భ్యుడు గుండెల్లి దేవి వరప్రసాద్, డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజ్‌దీప్, డిసిసి కార్య‌ద‌ర్శి మీసాల‌ జ‌య‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page