రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పునరుద్ధరించాలి
– ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వలిగి ప్రభాకర్


హైదరాబాద్, ఆగస్టు 03, అద్దం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పునరుద్ధరించి రూ. 500 కోట్లు కేటాయించాలని ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వలిగి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఎరుకుల ఉద్యోగుల హక్కుల రాష్ట్ర కో–కన్వీనర్ ఒలు గుత్తుల పోచయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వలిగి ప్రభాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది ఎరుకలు తెగ జనాభా కలిగి ఉన్నామని తెలిపారు. ఈ 29 సంవత్సరాలుగా ఎరుకల హక్కుల సాధనకు అనేక ఉద్యమాలు చేశామని పోరాట సమితి అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు. 29 రాష్ట్రాలలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలలో 140 కోట్ల మంది జనాభాలో 12 కోట్ల మంది ఆదివాసి తెగ ప్రజలు ఉన్నారన్నారు. ఎరుకల తెగల ప్రజలకు సామాజిక రాజకీయ చైతన్యం కల్పించరాన్నారు. విద్యా ఉద్యోగ సంక్షేమ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలలో ఎరుకల కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై వ్యతిరేకంగా పోరాటం కొనసాగించామన్నారు. జీవనోపాధివృత్తులను కాపాడుకోవడానికి ప్రజలకు సమాజంలో స్వీయ గౌరవాన్ని పెంపొందించడానికి వారిలోని ప్రతిభను చాటి చెప్పడానికి అనేక ఉద్యమాలు జరిగాయన్నారు. ఇవే కాకుండా అనేక పోరాటాలు చేసామని గుర్తు చేశారు. ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ…. ఎరుకల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎరుకుల ఉద్యోగుల హక్కుల జాతీయ కో– కన్వీనర్ గరిక శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కమిషన్ సభ్యుడు నరహరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply