వివి గిరి నగర్ బస్తీలో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు వెంటనే పూర్తి చేయాలి
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జనవరి 28, అద్దం న్యూస్ : వివి గిరి నగర్ బస్తీలో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు వెంటనే పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివిగిరి నగర్ బస్తీలో ఇటీవల పూర్తైన నూతన మంచినీటి, సివరేజి పైప్‌లైన్ పనుల అనంతరం రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు నత్తనడకన జరుగుతుందని కార్పొరేటర్ పావని బస్తీవాసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం జలమండలి డిజిఎం కార్తీక్‌రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్ లతో కలిసి కార్పొరేటర్ పావని ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను కార్పొరేటర్ పావని ప్రశ్నించారు. వెంటనే రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను పావని ఆదేశించారు. కార్పొరేటర్ పావని సూచనల మేరకు మరో మూడు రోజుల్లో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నాయకులు సాయి కుమార్, సాయి కిరణ్ యాదవ్, విజయ లక్ష్మి, బస్తీ వాసులు నర్సింగ్ రావు, సి.సాయి కుమార్, హన్మంత్ రావు తదితరులు పాల్గొన్నారు.![]()


