Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

📰 Generate e-Paper Clip

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

కాచిగూడ‌, జూలై 18, ( అద్దం న్యూస్ ) :   కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి, జేఏసీ కో–కన్వీనర్ బి.యాదగిరి అన్నారు. హైదరాబాద్ రీజియన్ ఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన జె.శ్రీలత ను కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సన్మానించారు. అనంతరం బి.యాదగిరి మాట్లాడుతూ… ఆర్టీసీ వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కాంట్రాక్ట్ కండక్టర్లు, డ్రైవర్లు కొన్ని కారణాల వల్ల రిమూవ్ ఆయిన కార్మికులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం సహాకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కె.మల్లేశ్, వెంకటేశ్, సుదర్శన్, భాగేశ్వర్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page