Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaపారిశుద్ధ్య‌ కార్మికుల సేవలు వెలకట్టలేనివి – జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ బాబు

పారిశుద్ధ్య‌ కార్మికుల సేవలు వెలకట్టలేనివి – జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ బాబు

📰 Generate e-Paper Clip

 

సిటీ కల్చరల్, అద్దం న్యూస్ : పారిశుద్ధ్య‌ కార్మికుల సేవలు వెలకట్టలేనివని సర్కిల్ 16 డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం తెలంగాణ భాష సంస్కృతి శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మారుతి దివాకర్ బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వళ‌న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య‌ కార్మికులు ఉదయం నుంచి తమ విధులు నిర్వర్తించి నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని వారిని గౌరవించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిశుద్ధ కార్మికుల సేవలు అపురూపమైనవన్నారు.

ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ.. గత కొద్ది కాలంగా ఉజ్వల సంస్థ విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. బాగ్అంబ‌ర్‌పేట్‌ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మహిళ దినోత్సవం సందర్భంగా ఉజ్వల సంస్థ సఫాయి కార్మికుల సేవలను గుర్తించి వారిని సన్మానించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ అంబ‌ర్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, సంస్థ అధ్యక్షురాలు ఎం.లక్మి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page