ఎర్రగొల్ల పహాడ్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ ప్రారంభం

ఎర్రగొల్ల పహాడ్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ పండుగ ప్రారంభం

జనగాం, ఫిబ్రవరి 2, అద్దం న్యూస్ : జనగాం జిల్లాలోని ఎర్రగొల్ల పహాడ్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి పండుగ ఘనంగా ప్రారంభం అయింది. గ్రామంలోని మాదిగ వాడలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని ఘనంగా అలంకరించారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి గ్రామం శివారులో ఉన్న పుట్ట మన్ను తెచ్చి, అర్థరాత్రి దాటే వరకు ఆలయం వద్ద బైండ్లొశ్లు, కళాకారులు విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల పై అమ్మవారి కుంకుమ, పసుపు వేపాకు జలం కలిపి భక్తుల పై చల్లి మైలలు తీశారు. ఈ కార్యక్రమానికి మాదిగ కుల పెద్దలతో పాటు మహిళలు, భక్తులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page