స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై మూడు పార్టీలు స్పష్టత ఇవ్వాలి – తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై మూడు పార్టీలు స్పష్టత ఇవ్వాలి

– తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్

హైదరాబాద్, జులై 5, అద్దం న్యూస్ :    స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై మూడు పార్టీలు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో న‌రేంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విధానం పై స్పష్టమైన వైఖరిని చెప్పకపోవడం విచారకరం అన్నారు. లాల్ బహుదూర్ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పై ప్రకటన చేస్తారని బీసీలు ఆశించారన్నారు. కానీ కనీసం స్థానిక బీసీ రిజర్వేషన్ల పై కాంగ్రెస్ అధినాయకులు స్పందించకపోవడం శోచనీయమ‌న్నారు. మరొక వైపు బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఉదరగొట్టి కనీసం పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదని.. బీజేపీ నిజ స్వరూపం తెలిసిన బీసీ నాయకులు ఎవ్వరు కూడా బీజేపీని నమ్మలేదన్నారు. స్థానిక బీసీ రిజర్వేషన్ల సుప్రీం కోర్టు విధించిన 50 శాతం సీలింగు తీర్పు పై స్టే తెచ్చిన బీసీల మేధావి డాక్ట‌ర్‌.పుంజల వినయ్ కుమార్ స్టే ను సుప్రీం కోర్టులో విత్ డ్రా చేసుకొని వచ్చి కనీసం బీసీ రిజర్వేషన్ల కోసం అమలు పరచడానికి సాధించడానికి కనీసం ఒక్క అడ్వ‌కేట్‌ను కూడా నియమించలేదు, నాటి అధికార టిఆర్ఎస్ ప్రభుత్య పెద్దలు నేడు బీసీల కోసం అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 34 శాతం ఉన్న స్థానిక రిజర్వేషన్లు కాస్తా 18 శాతంగా పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్, మండల పరిషత్తు మున్సిపల్ కార్పోరేషన్స్‌లో 22 శాతానికి పరిమితం చేసి ఉన్న రిజర్వేషన్ల సిస్టమ్ ను తుంగలో తొక్కి నేడు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు కార్చడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర శ్రీహరి గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ దాసరి మూర్తి, బిసి విద్యార్థి సంఘం అధ్య‌క్షుడు అజెయ్, బిసి యువ‌జ‌న సంఘం అధ్య‌క్షుడు రాజుయాద‌వ్‌, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా అధ్య‌క్షుడు సైదులు, ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడు నార‌గౌడ్‌, రాజాగౌడ్‌, ల‌వ‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page