న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో అధికారులు ట్రాపిక్ ఆంక్షలను విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఇందులో భాగంగా నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ పైకి అనుమతిని నిషేధించారు. బేగంపేట్, టోలీచౌకి మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్‌ప్రెస్ వేపైకి అనుమతించనున్నారు. అలాగే ఇవాళ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులకు సైతం అనుమతి లేదని అధికారులు ఆంక్షలను విధించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply