అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంట్లోని ఎయిర్ కండిషనర్ (AC) (AC explosion) ఒక్కసారిగా పేలిపోవడంతో, నిద్రిస్తున్న ముక్కుపచ్చలారని మూడేళ్ల కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్‌నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అంజుమన్ ఖాదీమల్ ముస్లీమిన్ విద్యాసంస్థల కార్యదర్శిగా పనిచేస్తున్న సయ్యద్ సైఫుద్దీన్ ఖాద్రీ తన కుటుంబంతో కలిసి అంజుమన్ మసీదు ప్రాంగణంలోని నివాసంలో ఉంటున్నారు. ఆయనకు నలుగురు సంతానం కాగా, వారిలో రహీం ఖాద్రీ, రహ్మాన్ ఖాద్రీ అనే మూడేళ్ల కవలలు ఉన్నారు.
శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటి బయట పనుల్లో ఉండగా, చిన్నారి కవలలు ఇద్దరూ గదిలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా గదిలోని ఏసీ పేలిపోయింది. మంటలు వేగంగా వ్యాపించడంతో గది మొత్తం పొగతో నిండిపోయింది. పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఇంట్లోకి వెళ్లగా అప్పటికే రహీం ఖాద్రీ మృతి చెందాడు. రహ్మాన్ ఖాద్రీ శరీరం 95% కాలిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయాడు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply