తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడుల మృతులకు నివాళి

ఉగ్రదాడిలో మృతిచెందిన వారిని నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, కందూరి కృష్ణ
హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ : జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతి చెందిన భారతీయులకు నివాళి కార్యక్రమం తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. శనివారం రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ చిక్కడపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై కందూరి కృష్ణ, తదితరులతో కలిసి కొవ్వత్తులతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉగ్రవాదులను అంతమోందించాలన్నారు. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతుందని, భారత ప్రభుత్వం గట్టి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ నాయకులు ప్రవీణ్, వాసు, ధర్మేంద్ర జైన్, అనిల్, ఆనంద్‌గౌడ్, నితిన్, బాలకృష్ణ, వికాస్, కృష్ణమోహన్, అనిల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply