తెలంగాణ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఉగ్ర‌దాడుల మృతుల‌కు నివాళి

 

తెలంగాణ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఉగ్ర‌దాడుల మృతుల‌కు నివాళి

ఉగ్ర‌దాడిలో మృతిచెందిన వారిని నివాళుల‌ర్పిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కందూరి కృష్ణ‌

హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :  జ‌మ్మూ కాశ్మీర్ ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడుల్లో మృతి చెందిన భార‌తీయుల‌కు నివాళి కార్య‌క్ర‌మం తెలంగాణ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. శ‌నివారం రాత్రి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై కందూరి కృష్ణ‌, త‌దిత‌రుల‌తో క‌లిసి కొవ్వ‌త్తుల‌తో ర్యాలీని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… ఉగ్ర‌వాదుల‌ను అంత‌మోందించాల‌న్నారు. పాకిస్తాన్ ప‌దే ప‌దే క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌ని, భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి స‌మాధానం చెప్పాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు ప్ర‌వీణ్‌, వాసు, ధ‌ర్మేంద్ర జైన్‌, అనిల్‌, ఆనంద్‌గౌడ్‌, నితిన్‌, బాల‌కృష్ణ‌, వికాస్, కృష్ణ‌మోహ‌న్‌, అనిల్ సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page