జర్నలిస్టుల సమస్యలపై స్పందించే సంఘం టీడబ్ల్యూజేఎఫ్ – ఎమ్మెల్యే వెంకట్రావు

భద్రాచలం, మార్చి 15, అద్దం న్యూస్ : భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బలంగా ఉందని, జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతుందని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, కార్యదర్శి కర్రా అనిల్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెంకట్రావు మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ జర్నలిస్టుల సంఘం చాలామంది జర్నలిస్టులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం అభినందనీయని అన్నారు.

ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం ఉండకుండా ప్రజల పక్షం, పాత్రికేయుల పక్షం ఉండాలన్న లక్ష్యంతో ఫెడరేషన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూజేఎఫ్ నెంబర్ వన్ జర్నలిస్టు యూనియన్ గా బలపడుతుందని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో కంటే ఈసారి ఫెడరేషన్ సభ్యత్వం రెట్టింపు కావాలని ఆయన సూచించారు.ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పూదోట సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఏఫ్‌డ‌బ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కర్రా అనిల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గుండెబోయిన వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు డి.రవికుమార్, జిల్లా నాయకులు మధులిక, కటారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page