Friday, September 18, 2026
Homeculturalsతెలుగు సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది

తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది

 

సిటీ కల్చరల్, ఏప్రిల్ 01, అద్దం న్యూస్ : తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్‌.ప్ర‌భాక‌ర్ అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వసంతోత్సవం పేరిట కూచిపూడి నృత్య ప్రదర్శనలు కళ్యాణ్ హంపి థియేటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎన్‌విఎస్ఎస్‌.ప్ర‌భాక‌ర్, సంస్కార భారతి అధ్యక్షుడు డాక్టర్ లయన్ సంఘిశెట్టి సత్యనారాయణ, రాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వ్యవస్థాపకురాలు పద్మజ శర్మ పెనుమూడి, అతుల్య ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు కె.లక్ష్మిదుర్గ, సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో అనేక విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ కళలు, కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. లక్ష్మీ దుర్గ నిర్వహణలో కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page