చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా
అరకొర పోస్టులతో పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు
– నిరుద్యోగ జేఏసి నేత శంకర్ నాయక్
హైదరాబాద్, జూలై 31, ( అద్దం న్యూస్ ) : 7437 పోస్టులు కాదు.. 19000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి లైబ్రరి వద్ద మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి నేత శంకర్ నాయక్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ లో 7000 తో మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని, రాష్ట్రంలో 19 వేల ఖాళీలు ఉన్న ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం వలన రాష్ట్రంలోని 33 జిల్లాలకు రిజర్వేషన్ పరంగా ఒకటి రెండు కంటే ఎక్కువ పోస్టులు రాలేదన్నారు. రెండు నెలల నుంచి పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ 19 వేలతో విడుదల చేయాలని నిరుద్యోగులు ధర్నా చేస్తున్న ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని వాపోయారు. పోలీస్ శాఖలో 19 ఖాళీలు ఉన్నాయని నిరుద్యోగులు చెప్పలేదని స్వయంగా మాజీ డిజిపి శివధర్ రెడ్డి, ప్రభుత్వమే పేర్కొందని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చారు.

నోటిఫికేషన్‌లో కనీసం వయోపరిమితిని పెంచలేదని, ఇంకో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి, వయోపరిమితిని కానిస్టేబుల్ కి 36 సంవత్సరాలు, ఎస్సై కి 38 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిజికల్ ఈవెంట్ లో అత్యంత క్లిష్టమైన నాలుగు మీటర్లు ఉన్న లాంగ్ జంప్ ని 3.8 మీటర్లకు తగ్గించాలని, పోస్టుల సంఖ్య పెంచాలన్నారు. నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకొనే ముఖ్యమంత్రి ఈ విధంగా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం రావడంలో నిరుద్యోగులు కీలకపాత్ర పోషించారనీ, ఈ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోంఇతనొ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రకారం మిగతా అన్ని మెగా డిఎస్‌సి, గ్రూప్స్, జెఎల్ఎం, బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల కాలయాపన చేసిందని, ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలు తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు నరేష్, కిరణ్, బాలకోటి, రవి యాదవ్, సవాయ్ సింగ్, సురేష్, గణేష్, శ్రీనివాస్, నరసింహ, కుమార్, శ్రీకాంత్, జయ శ్రీ, కల్పన, బిందు తదితరులు పాల్గొన్నారు.
![]()

![]()












Leave a Reply