అనుమానాస్పదస్థితిలో గుర్తు తెలియని మహిళ అస్తి పంజరం లభ్యం
నాలుగు నెలల క్రితం హత్య జరిగి ఉండవచ్చంటున్న పోలీసులు
పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే కనిపిస్తున్న వైనం
మహిళ మృతదేహం దుస్తువు పై వివేకానంద హెచ్ఎస్ పేరుతో లోగొ
హైదరాబాద్, ఏప్రిల్ 21, అద్దం న్యూస్ : కవాడిగూడ డివిజన్ ఎన్నో ఏళ్లుగా మూతబడి ఉన్న డిబిఆర్ మిల్స్‌లో నీరు లేని సంపులో ఓ గుర్తు తెలియని మహిళా అనుమానాస్పదస్థితిలో మృతి చెంది అస్తిపంజరం మాత్రమే కనిపిస్తున్న ఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. మహిళ మృతదేహం పై దాదాపు చినిగిపోయి ఉన్న దుస్తువు పై శ్రీ వివేకానంద హెచ్ఎస్ అనే లోగో ఉంది. కవాడిగూడ డివిజన్ గోశాల వెనకాల గల డిబిఆర్ మిల్స్ గత రెండున్నర దశాబ్దాలుగా మూతబడి పూర్తిగా చెత్తాచెదారంతో ఉండిపోయింది. డిబిఆర్ మిల్స్ పూర్తిగా నిర్మానుశ్యంగా చెత్తాచెదారం, చెట్లు ఉండటంతో ఏదో ఒక అవాంఛనీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఈ డిబిఆర్ మిల్స్‌లో అనేక సంఘటనలు జరిగాయి. ఓ అమ్మాయి పై అత్యాచారం కూడా ఈ డిబిఆర్ మిల్స్‌లోనే జరిగింది. అవాంఛనీయ ఘటనలకు కేరాఫ్‌గా డిబిఆర్ మిల్స్ మారిపోయింది. తాజాగా ఓ మహిళ అస్తిపంజరం డిబిఆర్ మిల్స్‌లో ఉన్న నీరు లేని పురాతన సంపులో పడిఉండటం సంచలనం సృష్టించింది. మహిళ మృతి చెంది దాదాపు 4, 5 నెలలు కావొస్తుందని పోలీసులు చెబుతున్నారు. దోమలగూడ సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ.నిరంజన్ లు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి… డిబిఆర్ మిల్స్ వివాదం కోర్టులో ఉండటంతో అందులో ఎటువంటి వస్తువులు లేక గోడలు కూడా కూలిపోయి ఉంది. అందులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించే పనులను చేపడుతుండగా సోమవారం పురాతన నీరు లేని సంపులో ఓ మృతదేహం ఉన్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న దోమలగూడ సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ.నిరంజన్, సిబ్బంది సంపు పై ఉన్న రంధ్రం నుంచి మృతదేహాన్ని బయటకు తీయడానికి వీలుకాకపోవడంతో సంపును పగులకొట్టారు. తీరా చూడగా దాదాపు అస్తిపంజరంగా మారుతున్న దశలో మృతదేహం కనిపించింది. మృతదేహం ఓ మహిళదని, 25-30 సంవత్సరాల వయస్సు ఆ మహిళకు ఉండవచ్చని, 4, 5 నెలల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని ( అస్తిపంజరాన్ని ) బయటకు తీయించి గాంధీ ఆసుపత్రి సిబ్బందితో అక్కడే పోస్టుమార్టం చేయించారు. అనంతరం గాంధీ మార్చురికి తరలించి భద్రపరిచారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న దోమలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహం పై బట్టలపై శ్రీ వివేకానంద హెచ్ఎస్ లోగో :

మహిళ మృతదేహం పై ఉన్న బట్టలపై ఉన్న శ్రీ వివేకానంద్ హెచ్ఎస్ లోగో
డిబిఆర్ మిల్స్‌లో పురాతన నీరు లేని సంపులో మహిళా మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులకు క్లూ దొరికింది. మహిళ మృతదేహం పై దాదాపు చినిగిపోయి ఉన్న దుస్తువుపై శ్రీ వివేకానంద్ హెచ్ఎస్ అనే లోగో ఉంది.అలాగే ఆ చొక్క కాలర్ లోపల టైలరింగ్ స్టిక్కర్ ఉంది. దీంతో మృతురాలు ఏదైనా స్కూల్‌లో పని చేస్తుండేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అస్సలు ఈ మహిళ ఎవరు ? ఈ గుర్తు తెలియని మహిళ మృతదేహం ఎవరిది.. ఎక్కడుంటుంది…మృతురాలిని ఎవరైనా చంపి సంపులో పడవేశారా ? లేదా ఆత్మహత్యకు పాల్పడిందా ? కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply