జీడిమెట్ల, మే 26, అద్దం న్యూస్ : సుచిత్ర వాసవి సేవాదళ్ సుచిత్ర కొంపల్లి ఆధ్వర్యంలో జీడిమెట్ల గ్రామంలో 700 మందికి నిర్వహించిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అన్ని దానాల కన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం గొప్పదన్నారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్నప్రసాద వితరణ ద్వారా అనేక మంది ఆకలి తీర్చిన వారిమి అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో మశెట్టి శివ కుమార్, ఉప్పల నాగరాజు, వెంకటేశం, నాగరాజు, శ్రీనివాస్, రమేశ్, నాగేశ్వర్, బిక్షపతి, కిష్టయ్య, పవన్ కుమార్, ఉప్పల రమేశ్, లక్ష్మణ్, గిరిధర్ ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply