Friday, September 18, 2026
HomeHyderabadనిబద్ధతతో సుపరిపాలనను అందించిన దార్శనిక రాజనీతిజ్ఞుడు వాజపేయి – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

నిబద్ధతతో సుపరిపాలనను అందించిన దార్శనిక రాజనీతిజ్ఞుడు వాజపేయి – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

నిబద్ధతతో సుపరిపాలనను అందించిన దార్శనిక రాజనీతిజ్ఞుడు వాజపేయి
– గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 25, అద్దం న్యూస్ :    నిబద్ధతతో సుపరిపాలనను అందించిన దార్శనిక రాజనీతిజ్ఞుడు వాజపేయి అని గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి కార్య‌క్ర‌మం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజ‌రై వాజ్‌పేయి చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… 21వ శతాబ్దపు భారతదేశానికి దిశానిర్దేశం చేసిన దార్శనిక రాజనీతిజ్ఞుడు వాజపేయి అని అన్నారు. ప్రజాస్వామ్యం, అభివృద్ధిపై ఆయనకు ఉన్న నిబద్దత, విశ్వాసం నేటికీ మన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తూనే ఉందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు దామోదర్, శ్రీకాంత్, రాజు, మహమూద్, సాయి కుమార్, సత్యేంధర్, సుక్క యాదగిరి, శశాంక్, యాదగిరి, బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page