...

వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయ‌కుడు, రాజనీతిజ్ఞుడు

వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయ‌కుడు, రాజనీతిజ్ఞుడు
»  మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 16, ( అద్దం న్యూస్ ) :   మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయ‌కుడు, రాజనీతిజ్ఞుడు అని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌  రామ్‌నగర్‌లోని ద‌త్తాత్రేయ నివాసంలో అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి కార్య‌క్ర‌మం ఆదివారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వాజ్‌పేయి చిత్ర ప‌టానికి ద‌త్తాత్రేయ పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… దేశం పట్ల జీవితాంతం ఆయన చూపిన అంకితభావం నేటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. బలమైన, సంపన్నమైన, స్వావలంబన కలిగిన భారతదేశం కోసం ఆయ‌న‌ కలలు కన్న దార్శనికత ఎల్లప్పుడూ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ బిజెపి నాయకులు సాయి కృష్ణ యాదవ్, కౌండిన్య ప్ర‌సాద్‌, నరేష్, శక్తి సింగ్, షిండే గణేష్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.