ఈ నెల 12న శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో
శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర
హైదరాబాద్, ఏప్రిల్ 10, అద్దం న్యూస్ : శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి నాయకులు పేర్కొన్నారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో వీర హనుమాన్ విజయ యాత్రకు సంబందించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి గడ్డం నవీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి సలహాదారులు ఉదయ్ కుమార్, తుడుం రాజు, ఉపాధ్యక్షుడు రవిచారి, సభ్యులు జగదీష్, ఇ.రాకేష్, యాది, ఎం.రాకేష్, సత్యనారాయణ, శ్రీను తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను అడిక్‌మెట్ అభయాంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. అక్కడి నుంచి రాంనగర్ చౌరస్తా, చేపల మార్కెట్, దయారా మార్కెట్, బాకారం, హరినగర్ వరకు శోభాయాత్ర కొనసాగుతుందని తెలిపారు. హిందువులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి నిర్వాహకులతో బేటి అయ్యారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా విజయయాత్రకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. యాత్ర ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది… ఏ ఏ రూట్‌లో యాత్ర కొనసాగుతుందనే విషయాలను నిర్వాహకులను ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా అడిగి తెలుసుకున్నారు.












Leave a Reply