Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadగ‌ణేష్ మండ‌పాల పూజ‌ల్లో పాల్గొన్న విన‌య్ కుమార్

గ‌ణేష్ మండ‌పాల పూజ‌ల్లో పాల్గొన్న విన‌య్ కుమార్

📰 Generate e-Paper Clip

గ‌ణేష్ మండ‌పాల పూజ‌ల్లో పాల్గొన్న విన‌య్ కుమార్

ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :    వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి వాల్మీకి నగర్ కృపా రావు లేన్ తో పాటు పలు గణేష్ మండపాల నిర్వాహకులు ఆహ్వానం మేరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ మండపాల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గణపతి విగ్ర‌హాల‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందచేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, రాజు, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, ఆనంద్ రావు, సాయి కుమార్, సత్యేందర్, జ్ఞానేశ్వర్, మండపం నిర్వాహకులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page