Friday, September 18, 2026
HomeHyderabadకార్మికుల త్యాగాల‌ను ముందుకు తీసుకెళ్తాం – భ‌వ‌న నిర్మాణ రంగ కార్మిక సంఘం ...

కార్మికుల త్యాగాల‌ను ముందుకు తీసుకెళ్తాం – భ‌వ‌న నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు కామ‌ల్ల అయిల‌న్న

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :    హ‌క్కుల కోసం త్యాగాలు చేసి అమ‌రులైన కార్మికుల త్యాగాల‌ను ముందుకు తీసుకెళ్తామ‌ని భ‌వ‌న నిర్మాణ రంగా కార్మిక సంఘం ( బిఎన్ఆర్‌కెఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు కామ‌ల్ల అయిల‌న్న అన్నారు. భ‌వ‌న నిర్మాణ రంగా కార్మిక సంఘం ( బిఎన్ఆర్‌కెఎస్ ) రాష్ట్ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో శ్ర‌మ‌జీవన కెర‌టాలు పుస్త‌క ఆవిష్క‌ర‌ణ స‌భ శుక్ర‌వారం హైద‌రాబాద్‌ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భ‌వ‌న నిర్మాణ రంగా కార్మిక సంఘం ( బిఎన్ఆర్‌కెఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు కామ‌ల్ల అయిల‌న్న మాట్లాడుతూ… గ‌తంలో భ‌వ‌న నిర్మాణాల రంగాల‌ సంఘంలోని రాష్ట్ర‌, జిల్లా క‌మిటీ నాయ‌కుల వివిధ హోదాల్లో ప‌ని చేసిన కార్మికుల బ‌యోగ్ర‌ఫిని రాసి ఈ పుస్త‌కంలో పొందుప‌ర్చామ‌న్నారు. దాదాపు 20 సంవ‌త్స‌రాలుగా ఈ సంఘంలో ప‌ని చేసిన వారు అకాల మ‌ర‌ణాలు పొందిన వారి బ‌యోగ్ర‌ఫీ ఈ పుస్త‌కంలో ఉంటుంద‌న్నారు. కార్మికుల‌కు ఇన్సురెన్సూ వ‌స్తుందంటే, ప్ర‌మాద‌వ‌శాత్తూ చ‌నిపోతే ఆరు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారం వ‌స్తుందంటే అమ‌ర కార్మికుల ఉద్య‌మాల వ‌ల్ల‌నే 1996 చ‌ట్టం వ‌చ్చింద‌న్నారు. ఈ చ‌ట్టం ద్వారా కార్మికులకు న్యాయం జ‌రుగుతుంద‌ని, దానికి అనేక మంది కార్మికులు కుటుంబాల‌కు దూర‌మై శ్రమించి, ఉద్య‌మాల్లో పాల్గొన్నార‌న్నారు. స‌మాజంలో జ‌రుగుతున్న అస‌మాన‌త‌లకు సంబంధించి గానీ, పెట్టుబడిదారుల విధానానికి వ్య‌తిరేకంగా గానీ అనేక అంశాల్లో పోరాడిన కార్మికుల‌ను గుర్తించుకోవ‌డం మా బాధ్యత అని అన్నారు. ఇలాంటి కార్మికుల‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు పాట‌ల రూపంలో కానీ, వ్యాసాల రూపంలో గానీ వారి జీవిత చ‌రిత్ర‌ల‌ను మేము బ‌తికున్న‌న్ని రోజులు వారి త్యాగాల‌ను ముందుకు తీసుకెళ్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉస్మానియా యూనివ‌ర్శిటీ ఉద్య‌మ‌కారుడు న‌ల్లిగంటి శ‌ర‌త్‌, సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉప్పు సాయికుమార్‌, కోశాధికారి తాటికొండ మ‌ధు, ఉపాధ్య‌క్షులు పిల్లి హ‌రిచంద్ర‌న్న‌, ఎస్‌కె.అలీ, కార్య‌ద‌ర్శి కుమార‌స్వామి, ప్ర‌చార కార్య‌ద‌ర్శులు వేములకొండ సంప‌త్‌, పిల్లి సూర్యం, కార్య‌వ‌ర్గ స‌భ్యులు మైస సాంబ‌య్య‌, మోటి పార‌య్య‌, పెద్ద‌ప‌ల్లి సూర‌య్య‌, కొముర‌య్య‌తో పాటు వివిధ జిల్లాల అధ్య‌క్షులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page