బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతాం
– తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 12, అద్దం న్యూస్ : బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హెచ్చరించారు. రవీంద్రభారతిలో ఆంధ్ర సినీ గాయకుడు బాలసుబ్రమణ్యం విగ్రహా ఏర్పాటును వ్యతిరేకిస్తూ శుక్రవారం హైదరాబాద్ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ( టియు జేఏసి ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కళాకారులు, ఆట, మాట దుంధాం నిర్వహించారు. తెలంగాణ అమరవీరులను గుర్తుకు చేస్తూ పాడిన పాటలు ఆనాటి ఉద్యమ రోజులను గుర్తు చేశాయి.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ కలలకు వేదిక అయిన రవీంద్రభారతిలో బాలసుబ్రమణ్యం విగ్రహం పెట్టడం క్షమించరానిదన్నారు. ఆంధ్రులు చేస్తున్న ఇలాంటి పనులను తెలంగాణ వాదులు ఖచ్చితంగా అడ్డుకుంటారని స్పష్టం చేశారు. రోశయ్య విగ్రహాన్ని పెట్టడం, ఎన్టీఆర్ విగ్రహం పెడతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని అవకాశంగా తీసుకుంటున్న ఆంధ్ర సినీ పెద్దలు రాజకీయ నాయకులు చాప కింద నీరులా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 12 రాష్ట్రాల తెలంగాణ స్వరాష్ట్రంలో ఇక్కడి సినీ కళాకారులకు, కవులకు, ప్రజల కోసం పని చేసిన మహోన్నత వ్యక్తులకు తగిన గుర్తింపు రాలేదన్నారు. దాశరధి, చుక్క సత్తయ్య, పైడి.జయరాజు, కత్తి కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, సి.నారాయణ రెడ్డి, చక్రి వేణుమాధవ్, ప్రత్యూష, ఇలా అనేక మందికి స్థూపాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించాలన్నారు. లేని ఎడల తెలంగాణ ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులు పోరాడు సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆంధ్ర రాజకీయ పోకడలను సహించమన్నారు. రవీంద్రభారతిలో బాలసుబ్రమణ్యం విగ్రహం పెడితే కచ్చితంగా అడ్డుకుంటామని ఆ విగ్రహాన్ని కూలగొడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు సుల్తాన్ యాదగిరి, తెలంగాణ క్రాంతి దళ్ పృధ్వి, తెలంగాణ సినిమా వేదిక మోహన్ బైరాగి, లారా, కళ్లెపు చంద్రన్న ప్రసాద్, వేముల యాదగిరి, సుజి, బాకారం లావణ్య, లక్ష్మి, లలిత, జానకి రెడ్డి, రాజేష్, సరళ, ప్రమీల, స్వరూప, బాల లక్ష్మి, అరుణ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply