Friday, September 18, 2026
HomeHyderabadవిద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం

విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం

 

హైదరాబాద్, ఏప్రిల్ 15, అద్దం న్యూస్ :    విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాంమ‌ని ఎస్ఎఫ్ఐ మ‌హాస‌భ‌లో నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా 43వ మహాసభలు జ‌రిగాయి. ఈ కార్య‌క్రమా నికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల పైన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకుల బుద్ధి మారడం లేదన్నారు. విద్యారంగంపై ఏ ప్రభుత్వం వచ్చినా సవతి తల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. విద్యా రంగానికి బడ్జెట్ కేటాయించడంలో, అభివృద్ధి పరచటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి 4,500 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సంక్షేమ వసతి గృహాలకు గురుకులాలకు పక్కా భవనాలు లేవని, మెస్ కాస్మోటిక్ చార్జీలు విడుదల కాకపోవడం విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా హoగు ఆర్భాటంతో ప్రచారాలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయల ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు . ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం అలసత్వాన్ని వీడాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు లేవని మౌలిక వసతులు కల్పించి , ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను, యూనివర్సిటీలలో ప్రొఫెసర్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి విద్యారంగ సమస్యలను పరిష్కరించని ఎడ‌ల‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామ‌ని హెచ్చరించారు.

ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక : 

జెండావిష్క‌ర‌ణ చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయ‌కులు  

ఎస్ఎఫ్ఐ నూతన ఆఫీస్ బేరర్స్‌గా 9 మందితో నూతన జిల్లా కమిటీ 27 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తిరిగి లెనిన్, అశోక్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా సంఘ నిర్మాణం చేస్తూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తామని, హైదరాబా జిల్లా విద్యారంగ సమస్యల పైన సమరశీల పోరాటాలు నిర్వహిస్థామన్నారు. హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా స్టాలిన్, రమ్య, నాగేందర్, శ్రీమన్ సహాయ కార్యదర్శిగా విగ్నేష్, రజినీకాంత్, సహన ని ఎన్నుకున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page