నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తాం
– ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, డిసెంబర్ 10, అద్దం న్యూస్ : నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ డివిజన్ వైఎస్సార్ పార్క్ స్ట్రీట్ నంబర్ 8లో రూ.10 లక్షల నిధులతో మంచినీటి పైప్‌లైన్ పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… నియోజకవర్గంలోని అన్ని డివిజన్లల్లో డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల ఆధునీకరణ చేసేందుకు నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, నాయకులు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, పులిగిల్ల శ్రీధర్ చారి, శ్రీధర్‌గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply