Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఆర్య నగర్ బస్తీ సమస్యలను పరిష్కరిస్తాం – సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావుగౌడ్‌

ఆర్య నగర్ బస్తీ సమస్యలను పరిష్కరిస్తాం – సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావుగౌడ్‌

📰 Generate e-Paper Clip

ఆర్య నగర్ బస్తీ సమస్యలను పరిష్కరిస్తాం

– సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావుగౌడ్‌

సికింద్రాబాద్, జులై 31, అద్దం న్యూస్ :    తార్నాక డివిజన్‌లోని ఆర్య నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ఆర్యనగర్ స్థానిక సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం సితాఫలమండీలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ తో సమావేశమై వివిధ సమస్యల పై వినతి పత్రాన్ని సమర్పించారు. పోలీసు గస్తీ పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రోడ్డు పునర్నిర్మానాన్ని చేపట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సంఘం నేతలు కుమార్ షాను, హరి కృష్ణ తదితరులు కోరారు. కమ్యూనిటీహాల్ నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయించాలని కోరారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page