జవహర్‌న‌గ‌ర్ స్థానికుల సమస్యలను పరిష్కరిస్తాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

 

జవహర్‌న‌గ‌ర్ స్థానికుల సమస్యలను పరిష్కరిస్తాం

– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

                   జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తున్న గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :  జవహర్‌న‌గ‌ర్ స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామ‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ గ‌డ్డంసార్ స్కూల్ వీధి, స‌బ్‌లోక్ హాస్పిట‌ల్ వీధి, స్ట్రీట్ నంబ‌ర్ 10లో స్థానికుల ఫిర్యాదు మేర‌కు కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ శ‌నివారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె స్థానికుల‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగితెలుసుకున్నారు. వేస‌వి కావ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం అవుతుంద‌ని, ప్ర‌మాద‌క‌రంగా ఉన్న చెట్ల కొమ్మ‌ల‌ను తొల‌గించాల‌ని కార్పొరేట‌ర్‌కు బ‌స్తీవాసులు చెప్పారు. ఇందుకు స్పందించిన కార్పొరేట‌ర్ పావ‌ని సంబంధిత హార్టిక‌ల్చ‌ర్‌, విద్యుత్ శాఖ ఏఈల‌కు ఫోన్లు చేసి మాట్లాడారు. క‌రెంట్ తీగ‌ల పై విద్యుత్ వైర్ల‌ను తొల‌గించాల‌ని, వంగిన చెట్ల కొమ్మ‌ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయన్ని క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. వెలగని స్ట్రీట్ లైట్ల‌ రిపేర్లు చేయాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, శివ కుమార్, సత్తి రెడ్డి, ఆనంద్ రావు, నీరజ్, సంయుక్త రాణి, స్థానికులు విశ్వనాథ్, సూర్యనారాయణ, ధనుంజయ్, సుభాష్, అశోక్, కెనెడీ, తినయత్ అలి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page