పార్కుల అభివృద్ధికి కృషి చేస్తాం
– ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, జూన్ 27, ( అద్దం న్యూస్ ) : పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బాగ్‌లింగంపల్లి వీఎస్‌టి పార్కు వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్కులోని వాకర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్కులో వాష్ రూమ్, యోగా స్థలాన్ని పెంచాలని, వాకింగ్ పాత్ ట్రాక్ సెట్ చేయడం, ఓపెన్ జిమ్ వస్తువులకు మరమ్మతులు చేయాలని, ఓపెన్ షెడ్‌ను ఏర్పాటు చేయాలని వాకర్లు ఎమ్మెల్యే గోపాల్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంగాధర్‌రెడ్డి, సభ్యులు జైహింద్, మురళీధర్, ఆంజనేయులు, శ్రీనివాస శర్మ, అనిల్, కోటేశ్వర రావు, మధుకర్, ముదిగొండ మురళీ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply