...

అప్పులు ఉన్న‌ప్పుడు అందాల పోటీలు ఎందుకు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

అప్పులు ఉన్న‌ప్పుడు అందాల పోటీలు ఎందుకు

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ :    మహిళలకు 15000 ఇస్తానని నోటికొచ్చిన వాగ్దానాలన్నీచేసి అధికారం దక్కించుకొని ఈనాడు ఎవరికి పనికిరాని ఉపయోగం లేని మిస్ ఇండియా పోటీలు నిర్వహించి 70 కోట్ల ప్రజాధనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దుర్వినియోగపరిచారని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. అసలు ముఖ్యమంత్రి ఎవరి సలహా మేరకు ఈ పనులు చేస్తున్నారా ? రాహుల్ గాంధీ చెప్పితే చేస్తున్నారా లేక కాంగ్రెస్ అధిష్టానం అందాల పోటీలు నిర్వహించాలని చెప్పిందా అని సాయిబాబా ప్రశ్నించారు. దీనివల్ల అంతర్జాతీయంగా పరపతి పెరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే అంతర్జాతీయ ఖ్యాతి పెరుగుతుందా అని ప్రశ్నించారు. మంగ‌ళ‌వారం న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… “ఆడలేక మద్దెల ఓడు నన్నట్లు” తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సులు, ఇతరాలు ఇవ్వలేమంటూ ఉద్యోగ సంఘాల నాయకులతో బెదిరించే దోరణిలో మాట్లాడటం చాలా విచారకరమైన విషయమని అన్నారు. ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అంతగా చేతగానప్పుడు ఎన్నికల ముందు ఉత్తరకుమార ప్రగల్బాలు పలికిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. మహిళలకు తులం బంగారం ఇస్తానని ఎంతో మంది విద్యార్థులకు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అందక వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టి వేయబడుతుందని అన్నారు. ఈ 70 కోట్లతో కనీసం కొంత మందికైనా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ దక్కేదని అన్నారు. ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన కోర్కెలు అడిగితే నన్ను కోసుకొని తినమని మాట్లాడడం సరికాదని, ఒకప్పుడు బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఈరోజు పిరికి మాటలు మాట్లాడడం తగదని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని అన్నారు. చేతకాకపోతే తప్పుకోండని హితవు పలికారు. మీరు కాకపోతే మకొకరు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని అన్నారు.

ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక అంతర్భాగమని.. వారిని బెదిరించడం అంటే మిమ్మల్ని మీరే బెదిరించు కోవడన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు చేపట్టి మద్యేమార్గంగా సమస్య పరిష్కారానికి చొరవ చూపకుండా, ఈ అందాల పోటీల వల్ల ఉపయోగ మేమిటని, దీని ఆంతర్యమేమని సాయిబాబా అడిగారు. నగరం ఒక్క వర్షానికే వాగులను, వంకలను తలపింస్తుంటే, పట్టించుకోకుండా మూడో నగరం నిర్మిస్తానని మాట్లాడడం నిజంగా ఉత్తరకుమార ప్రగల్బాలు కావా అని అన్నారు. జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే మరొక నగరం నిర్మించే ఆలోచన ఎందుకని అన్నారు. కమిషన్ల కోసం నోటికి వచ్చిందల్లా మాట్లాడ వద్దని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేవలం డంబాచారాలు కొట్టుకోవడం తప్ప. మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చేశారన్నారు. ఇప్పటి వరకు సుందరీకరణ కార్యరూపం దాల్చలేదన్నారు. మీ పార్టీలో ఉన్న పెద్దలు, బడా బాబుల ఫామ్ హౌజులు. విల్లాల జోలికి పోకుండా పేదల ఇళ్ల పైనే పడుతుందని, ఇప్పటికైనా పనికిరాని వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, నాయ‌కులు ఎంకె.బోసు, రాజేంద్ర ప్రసాద్, పరశురాం, ఎం.రాజు, భానుప్రకాష్, ఎస్.ప్రకాష్, మల్లిఖార్జున్, కప్ప కృష్ణాగౌడ్, సుక్రవేది, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.