కంటోన్మెంట్ ను అన్ని రకాల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడుతా – మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా బానుక నర్మద మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం

 

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : కంటోన్మెంట్ ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో కంటోన్మెంట్ పాలకమండలితో పాటుగా నేను ఎంపీగా ఉన్న కాబటి వారికి అన్ని రకాల తోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తానని మల్కాజిగిరి ఎంపి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా బానుక నర్మద మల్లికార్జున్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎంఎల్ఏ గణేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… 99 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్న పేదలకు హక్కులు కల్పించాలని రక్షణ శాఖను కోరుతున్నారన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి అవి అమలయ్యే ప్రయత్నం చేస్తానన్నారు. కంటోన్మెంట్ లో నీళ్లు, రోడ్లు ఇతర ఏ సమస్యలున్న పరిష్కారానికి పాలకమండలతో పాటుగా నేను కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి కంటోన్మెంట్ ప్రజలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కంటోన్మెంట్ బోర్డు మీద ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండానే అని ఈటల ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో శానిటైజేషన్ వర్కర్లు చాలామంది చనిపోయారని, కంపెన్సేషన్ పోస్టులతో పాటు వన్ టైం సెటిల్మెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు. కంటోన్మెంట్లో ఏ మార్పులు అభివృద్ధి పై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడుతానని చెప్పారు. బానుక నర్మద మల్లికార్జున్ కు బోర్డు మెంబర్ గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో నామినేట్ అవ్వడం జరిగిందన్నారు. ఈ నామినేటెడ్ పదవి కోసం కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మంత్రివర్యులు బండి సంజయ్ ఆశీర్వాదంతో ఆ బాధ్యత రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌద్ తదితరులు పాల్గొన్నారు

.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page