హైదరాబాద్, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లిలోని మాచర్ల జ్యువెలరీ షాప్ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 11:22 గంటల సమయంలో ఓ మహిళ మృతదేహం రక్తంతో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందచేశారు. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే తేజస్వి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో నరేందర్ ( 34 ) అనే వ్యక్తి తన భార్య తేజస్వి ( 29 ) పై రోకలి బండతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తేజస్వి తలకు తీవ్ర గాయాలు కావడంతో భారీగా రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోయినట్లు సమాచారం. పోలీసుల వచ్చిన తర్వాత ఆమె మృతి చెందిందని ధృవీకరించారు. హత్య చేసిన అనంతరం నరేందర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది ఉంది.
చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య
RELATED ARTICLES

