మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : దేశవాళీ క్రికెట్లో మహిళా క్రికెటర్లు, మ్యాచ్ అధికారుల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ రెట్టింపుకన్నా ఎక్కువ పెంచింది. దీంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అమ్మాయిల ఆర్థిక స్థిరత్వం పెరగనుంది. భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పెంపుదలను బోర్డు అపెక్స్ కౌన్సిల్ ధ్రువీకరించింది. సవరించిన చెల్లింపు విధానం ప్రకారం.. సీనియర్ మహిళల దేశవాళీ వన్డే టోర్నమెంట్, బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ప్లేయర్లకు రోజుకు రూ.50 వేలు చెల్లిస్తారు. ఇంతకుముందు ఈ ఫీజు రూ.20 వేలు మాత్రమే. రిజర్వ్‌లు రూ.25 వేలు పొందుతారు. జాతీయ టీ20 టోర్నీల్లో తుది జట్టులో ఉన్న వాళ్లకు రోజుకు రూ.25 వేలు ఇస్తారు. రిజర్వ్‌లకు రూ.12.500 లభిస్తాయి.
అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు సీజన్‌లో రూ.12 నుంచి రూ.14 లక్షల వరకు సంపాదించవచ్చు. ఇక అండర్-23, అండర్-19లో ఆడే అమ్మాయిలకు రోజుకు రూ.25 వేలు చెల్లిస్తారు. రిజర్వ్‌లు రూ.12.500 పొందుతారు. మరోవైపు దేశవాళీ అంపైర్లు, రిఫరీల ఆదాయం కూడా బాగా పెరగనుంది. వాళ్లు రోజుకు రూ.40 వేలు అందుకుంటారు. అదే నాకౌట్ మ్యాచ్‌లకైతే ఫీజు.. మ్యాచ్ ప్రాధాన్యతను బట్టి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది. అంటే ఓ అంపైర్ రంజీ ట్రోఫీ లీగ్‌కు మ్యాచ్‌కు రూ.1.60 లక్షలు, నాకౌట్ మ్యాచ్‌కు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్జిస్తారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply