బండారు వైష్ణవ్‌ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

బండారు వైష్ణవ్‌ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు
» వివిధ రంగాల్లో విశిష్ట సేవ‌ల‌నందించిన‌ ప్ర‌ముఖ మ‌హిళా ప్ర‌తిభావంతులకు స‌న్మానం
» మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాల క‌ల్ప‌న‌తోనే దేశం అభివృద్ధి
– మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

హైదరాబాద్, మార్చి 7, అద్దం న్యూస్ : మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి, బండారు వైష్ణవ్‌ మెమోరియల్ ఫౌండేషన్ చైర్‌ప‌ర్స‌న్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ‌నివారం మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జ‌రిగాయి. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య క‌ళా నియ‌ల‌యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఆయ‌న‌తో పాటు న్యాయమూర్తి మాధవిలత, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, ఇఫ్లూ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ సునైనా సింగ్, రమాదేవి, ప్ర‌ముఖ టివీ ఛాన‌ల్ల జ‌ర్న‌లిస్ట్ దీప్తి వాజపేయి సహా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురు మహిళా ప్రతిభావంతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సమాజంలోని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ మహిళలను ద‌త్తాత్రేయ‌, విజ‌య‌ల‌క్ష్మీ లు ఘ‌నంగా సత్కరించారు.

ఈ సంద‌ర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహిళల సాధికారత, సమానత్వం గురించి ప్రస్తావిస్తూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మ‌హిళ‌ల‌ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, మహిళలు సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మహిళా నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page