ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల‌తో ప‌నులు ప్రారంభం – ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి

 

  ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల‌తో ప‌నులు ప్రారంభం

– ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి

 

హైద‌రాబాద్‌, మే 1, అద్దం న్యూస్ :   ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల‌తో ప‌నులు ప్రారంభం అయ్యాయ‌ని ముషీరాబాద్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి అన్నారు. ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో సుమారు రూ.12 ల‌క్ష‌ల నిధుల‌తో నిర్మిస్తున్న సిసి రోడ్డు ప‌నుల‌ను కొండా శ్రీధ‌ర్‌రెడ్డి ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఎమ్మెల్యే ముఠా గోపాల్ చొర‌వ‌తో అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. డివిజ‌న్‌లో సిసి రోడ్లు, మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్ల‌ను వేయిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జావెద్ ఖాన్‌, మునావ‌ర్ చాంద్‌, బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం అధ్య‌క్షుడు స‌య్య‌ద్ ప‌ర్వేజ్‌, సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ జునైద్‌, నాయ‌కులు బాబా, సమీర్‌, క‌రీమ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page