మంచినీటి ఎద్దడి లేకుండా సమన్వయంతో పని చేయండి
» వాటర్ వర్క్స్ అధికారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 24, అద్దం న్యూస్ : నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా సమన్వయంతో పని చేయాలని వాటర్ వర్క్స్ అధికారులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. మంగళవారం చిలకలగూడ జలమండలి డీజీఎంగా విష్ణువర్థన్‌రావు బాధ్యతలు చేపట్టారు. జలమండలి సెక్షన్ మేనేజర్లు జీవన జ్యోతి, శివసాయి, సురేష్‌కుమార్ లతో కలిసి నూతన డిజిఎం విష్ణువర్థన్‌రెడ్డి ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిజిఎంను ఎమ్మెల్యే ముఠా గోపాల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… ముషీరాబాద్ నియోజకవర్గంలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను రాకుండా చూడాలన్నారు. డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఏ ఏ బస్తీల్లో ఆ సమస్య ఉందో వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వాటర్ వర్క్స్ అధికారులందరూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, పట్నం నరేష్ ముదిరాజ్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply