హైదరాబాద్, ఏప్రిల్ 23, అద్దం న్యూస్ : ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి కావడంతో మనస్థాపం చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సిఐ రాంబాబు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి… భోలక్‌పూర్ డివిజన్ ఇందిరానగర్ బస్తీకి చెందిన బాబురావు, జయశ్రీ ల కొడుకు గణేష్ ( 20 ) చదువు మధ్యలోనే ఆపేసి పద్మారావునగర్‌లో ఓ జిమ్‌లో జిమ్ ట్రైనర్‌కు అసిస్టెంట్‌గా పని చేస్తుండేవాడు. ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు జిమ్ వెళ్లి వస్తుంటాడు. మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంటాడు. ఇదిలా ఉండగా గణేష్ ఒక యువతితో వన్ సైడ్ ప్రేమను కొనసాగిస్తున్నాడు. పది రోజుల క్రితం ఆ యువతికి మరొకరితో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి గణేష్ మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. ఇదిలా ఉండగా రోజు మాదిరిగానే ఈ నెల 21వ తేదీ ( సోమవారం ) మధ్యాహ్నం జిమ్ నుంచి వచ్చిన గణేష్ ఇంట్లోనే ఉన్నాడు. అదే సమయంలో గణేష్ తల్లి, తమ్ముడు వాళ్లు వాళ్లు పని చేసే దుకాణాలకు వెళ్లిపోయారు. అదే సమయంలో గణేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనుల నుంచి ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్న గణేష్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply