Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabad104వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ మహా సభ

104వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ మహా సభ

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, అద్దం న్యూస్ : జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హైద‌రాబాద్ విద్యానగర్ లో 104వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ మహా సభ మంగళవారం ఉదయం ఘనంగా జరిగింది. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు జగదాంబ, పింగళి వెంకయ్య స్మారక సంస్థ ఛైర్‌ప‌ర్స‌న్ శ్యామ‌ల‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన బిజెపి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రొయ్యూరి శేష సాయి, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయ‌కుడు కేశవ్, లయన్స్ క్లబ్ మెంబర్ మిలియన్ బాబురావు తదితరులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల దేశభక్తి గేయాలు సంస్కృతి కార్యక్రమాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. దేశభక్తిని పెంపొందించే పలు కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అల‌రింప‌చేశాయి. అనంతరం విద్యాన‌గ‌ర్‌లోని ప‌లు వీధుల్లో జాతీయ జెండాలను విద్యార్థులు చేతిన పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. జాతీయ భక్తిని పెంపొందించే వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి మ్యూజిక్ అకాడమీ సీతారత్నం జాతీయ గీతం పై ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ప్రసూనాంబ, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page