Friday, September 18, 2026
No menu items!
Homedevotionalఘ‌నంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ జయంతి

ఘ‌నంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ జయంతి

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :  భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ అనుసంధానం ( BMEU–BMS ) గుర్తింపు యూనియ‌న్‌ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి, ఎంఎంసి, సిఎంసి ప్రధాన కార్యాలయాలు, జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాలు, వార్డులలో శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ జయంతి కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, ముషీరాబాద్, కవాడిగూడ, బోయిగూడ, మల్కాజిగిరి, ఉప్పల్, అల్వాల్, కాప్రా, యూసుఫ్‌గూడ, గోల్కొండ జోన్, ఖైరతాబాద్ జోన్, సికింద్రాబాద్ జోన్, ఉప్పల్ జోన్, ఎల్‌బి.నగర్ జోన్, మల్కాజిగిరి జోన్, జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో, ఆయా జోనల్, సర్కిల్, వార్డుల్లో జ‌రిగిన జ‌యంతి కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ ( భారతీయ మజ్దూర్ సంఘ్ ) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.కృష్ణ హాజ‌ర‌య్యారు.

ఈ భూమండలానికి వివిధ కళలు, వృత్తులు, నిర్మాణ నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచిన విశ్వకర్మ భగవానునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ( BMEU–BMS ) గుర్తింపు యూనియ‌న్‌ నాయకులు, జోనల్ కార్యవర్గ సభ్యులు, సర్కిల్, వార్డు స్థాయి కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page