హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ ఆధ్వర్యంలో 104వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ మహాసభను ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ విద్యానగర్‌లోని సంస్థ హెడ్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ స్మారక సంస్థ ఛైర్మన్ కోడూరి శ్యామలరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సి అద్దంకి దయాకర్, విశిష్ట అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఓయు రిటైర్డ్ రిజిష్ట్రార్, మాజీ ఓఎస్‌డి టి.కృష్ణారావు, ప్రత్యేక ఆహ్వానితులుగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరి శేషసాయి, టిపిసిసి కార్యదర్శి కేశవ్, లయన్స్ క్లబ్ సభ్యుడు మిరియం బాబురావు, శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కెహెచ్ఎస్.జగదాంబ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలో వాగ్దేవి మ్యూజిక్ అకాడమీ నిర్వాహకులు ఎన్.సీతారత్నం ఆధ్వర్యంలో గీతాలాపన కార్యక్రమం ఉంటుందన్నారు. 104వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ మహాసభకు ప్రతిఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply