10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చాలి
– పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు
హైదరాబాద్, డిసెంబర్ 11, అద్దం న్యూస్ : 10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చాలని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు కోరారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో గురువారం కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలాస్ కు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ…. పదవ తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చ్ 14 నుండి ఏప్రిల్ 16 వరకు ఉంటాయని ఈ నెల 8వ తేదీన బోర్డు డైరెక్టర్ విపి శ్రీహరి షెడ్యూల్ రిలీజ్ చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 5.27 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారని, వీరందరూ కూడా పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలిస్తే 35 రోజులు పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీన్ని గమనిస్తే ఒక్కొక్క పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజులు సెలవులు వస్తున్నాయన్నారు. దీని వలన విద్యార్థులలో పరీక్షల పట్ల శ్రద్ధ తగ్గుతుందన్నారు. కొంత మంది మంది విద్యార్థులలో మానసిక ఒత్తిడి, భయాందోళన పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. కనుక పాత పద్ధతి లాగానే పరీక్షలను కొనసాగించాలని, లేదా ఒక్కో పరీక్షకు 1 లేదా 2 రోజులు సెలవు ఉంటే సరిపోతుందన్నారు. ఈ షెడ్యూలు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు భారంగా మారుతుందన్నారు. దీని వలన 6 నుండి 9 వ తరగతి వరకు వార్షిక పరీక్షలపై కనీసస్థాయిలో దృష్టి పెట్టలేరన్నారు. వీటి ఫలితాలు విడుదల చేయడం ఆలస్యం అవుతుందని తెలిపారు. కార్పొరేట్ జిల్లా స్థాయి ర్యాంకుల కోసం పోటీపడి పరీక్షల్లో స్కూళ్ళలా ర్యాంకుల కోసం పోటీపడి పరీక్షలలో జిల్లా అధికారులు జోక్యం చేసుకోవడం ద్వారా పరీక్షల వ్యవస్థ స్థాయి దిగజారుతుందన్నారు. అధికారులు విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని పరీక్షల షెడ్యూల్ సవరించి తిరిగి విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు తీగల శ్యామ్, షేక్ అసిఫ్, సిహెచ్.మౌనిక తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply